ఘనంగా సాగిన గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ ప్రేమ వివాహం!

  • శనివారం హైదరాబాద్ లో వివాహం
  • నోవాటెల్ హోటల్ లో ఘనంగా వేడుకలు
  • సెర్బియా చెస్ ప్లేయర్ నడ్జాతో పెళ్లి
అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదాను పొందిన భారతీయుడిగా రికార్డు సృష్టించిన చెస్ స్టార్ పెంటేల హరికృష్ణ ప్రేమ వివాహం శనివారం హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. సెర్బియాకు చెందిన మాజీ చెస్ స్టార్ నడ్జాను హరికృష్ణ ప్రేమించిన సంగతి తెలిసిందే. వీరి వివాహానికి పెద్దల నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలూ రాకపోవడంతో బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం సాగింది. గుంటూరు జిల్లాకు చెందిన హరికృష్ణ, విశ్వనాథన్ ఆనంద్ స్ఫూర్తితో చదరంగంలో రాణించి, పలు విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. నూతన దంపతులకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
Go Back to Shorts
Harikrishna
Chess
Nadza
Marriage
Hyderabad

More Telugu News